సంగారెడ్డి జిల్లా రాయికొడ్ మండలం పంపాడ్ గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగు నీరు రోడ్డు పైకి వస్తుంది. కాలువలో నీరు ఆగిపోవడంతో దోమలు, దుర్వాసనతో ఇబ్బందులు ఎదురుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు సమస్యపై స్పందించి చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.