జాతీయ లోక్ అదాలత్ లో 4, 121 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి కోర్ట్ లో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అందులో సివిల్ కేసులు 52, ఎంవీఒపీ కేసులు 29, క్రిమినల్ కాంపౌండబుల్ 3, 526, ఎన్ ఐ ఆక్ట్ 1, సైబర్ క్రైమ్ 50, ప్రిలిగేషన్ కేసులు ఐదు, విద్యుత్ సౌర్యం 212 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.