సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టరేట్లో అంగన్వాడి ఉద్యోగులు 48 గంటల నిరసన దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ. అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26, 000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సహాయ కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.