సంగారెడ్డి లోని అంబేద్కర్ మైదానంలో ఈనెల 16 నుంచి 21 తేదీ వరకు జరిగే జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడ పోటీల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మాధురి శనివారం పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఆరు క్రీడ అంశాలకు సంబంధించి క్రీడాకారులు వస్తున్నందున ఏర్పాటు చేయాలని డిఎస్ఓ కు సూచించారు. పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కార్ హాజరవుతారని చెప్పారు.