వికలాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు మాణిక్ మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 4 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం కేటాయించాలని కోరారు.