హైడ్రా పేరుతో పేదలను భయాందోళనకు గురి చేయవద్దని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహబూబ్ ఖాన్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని మార్క్స్ నగర్ లో ప్రజలతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎఫ్ టి ఎల్ పేరుతో అధికారులు మార్కింగ్ వేసినట్లు చెప్పారు. 30 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్న పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు.