సంగారెడ్డి రాజీవ్ పార్కులో మూడు ఫౌంటెయిన్లు పనిచేయడం లేదు. ఫౌంటెయిన్ల చుట్టూ పిచ్చిగడ్డి పెరిగి అద్వానంగా మారాయి. పార్కుకు ఆహ్లాదం కోసం వచ్చేవారికి సమస్యలే దర్శనమిస్తున్నాయి. ఫౌంటేన్లు మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.