మకర సంక్రాంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో ఏనుగు అంబారి ఊరేగింపు కార్యక్రమం శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాము గురుస్వామి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. సంజీవని హనుమాన్ మందిరం నుంచి శ్రీ నవరత్నాల దేవస్థానం వరకు ఎనుగు అంబారి ఊరేగింపు జరిగింది. కేరళ వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయ్యప్ప స్వామి పాటలు ముందుకు సాగారు.