సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీ.సీ కాలనీ, బీరప్ప బస్తిలలో హాజ్రత్ సయ్యద్ సహా గోరేబాబా దర్గా సందల్ ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి. చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చాదర్ సమర్పించి మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.