సంగారెడ్డి పట్టణం రాజంపేట నుండి మల్కాపూర్ వెళ్లే దారిలో ప్రధాన రహదారికి అనుకొని గాలి పోచమ్మ గుడి వద్ద ఉన్న సర్వే నెంబర్ 374 లోని దాదాపు ఇరవై గుంటల ప్రభుత్వ భూమిని కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు క్షబ్జా చేసి ప్రహరీగోడ నిర్మించారని వెంటనే అట్టి ప్రహరీ గోడను తొలగించి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్న వారి పై చట్ట ప్రకారం చర్య తీసుకొని ప్రభుత్వ భూమిని ప్రజల సామాజికగా అవసరాలకు కాపాడాలని సంగారెడ్డి తహసీల్దార్ విజయ్ కుమార్ కు స్థానిక రాజంపేట ఇందిర కాలని డ్రైవర్స్ కాలని వాసులు వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో టేకుల అశోక్, దన్నారం ప్రశాంత్, దన్నారం, వడ్డే వీరయ్య, వెంకటేష్, పూజారి ప్రభాకర్, బండ గోపాల్, శ్రీధర్ మహేంద్ర,
జగన్ మోహన్ , వడ్డే కన్నయ్య , తోకలసాయి కిరణ్, తదితరులు ఉన్నారు.