జైల్లో ఉన్న లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను వేధిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.