ధనుర్మాసం సందర్భంగా సంగారెడ్డి శివారులోని శ్రీ వైకుంఠాపురంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని దేవాలయ పురవీధుల మీదుగా నిర్వహించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేశారు.