మార్గశిర మాసం మొదటి మంగళవారం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం బ్రాహ్మణవాడలోని పురాతన సట్టి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు శివశర్మ ఆధ్వర్యంలో హనుమంతునికి మన్యుసూక్త సహిత అభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. తమలపాకులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. స్వామి వారికి మంగళహారతులు, మహా నైవేద్యాన్ని సమర్పించారు.