సోమేశ్వర స్వామి ఆలయంలో శివనామస్మరణ భజనలు

54చూసినవారు
శ్రావణమాసం మొదటి సోమవారం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని సోమేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగానికి ప్రత్యేక అభిషేకాలతో పాటు బిల్వాలతో పూజా కార్యక్రమాలను జరిపించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ జాగరణ చేశారు. అనంతరం మంగళహారతులు, మహా నైవేద్యాన్ని సమర్పించారు.

సంబంధిత పోస్ట్