సంగారెడ్డి జిల్లాలోని అందోల్ మండలం చందమ్ పేట నుండి సైబన్ పేట వైపు వెళ్ళే సింగుర్ నీటి కాల్వ పూడిక నిండి అనేక చోట్ల గండి పడి సింగుర్ కాల్వ నీరు చందమ్ పేట గ్రామంలో ని పంట పొలాలు ముంపునకు గురి చేస్తోందని నీటి ముంపు వల్ల దాదాపు 40 నుండి 50 ఎకరాల వరకూ పంట పొలాలు నీటి ముంపు నాకు గురై వరి, పత్తి, ఉల్లిగడ్డ, టమాటా, వంకాయ పంటలు వేసిన రైతులు నీటి ముంపు వల్ల పంటలు పెరుగక దిగబడి రాక పంట పెట్టు బడులు నష్ట పోవాల్సి వస్తుందని, వెంటనే జిల్లా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చందమ్ పేట గ్రామం నుండి వెళ్ళే సింగుర్ కాల్వ పూడిక తీసి, కాల్వలో నీరు వదల టానికి కంట్రోల్ వాల్ ఏర్పాటు చేసి కాల్వ ఇరు పక్కల కట్ట ఎత్తు పెంచి కాల్వలు గండి పడి వున్న చోట్ల మరమ్మతు చేసి పంట పొలాలు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులతో పంట ముంపు ప్రాంతాల్లో పరిశీలించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర, కావున అధికారులు వెంటనే క్షేత్ర స్థాయిలో విచారణ చేసి రైతుల పంట పొలాలు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమములో రైతులు హనుమాన్ దాస్ , హరి కృష్ణ, నర్సిములు, కృష్ణ, శంకరయ్య, జోగినాథ్ , మల్లేశం, జగ్గయ్య, రాములు, సలీం, నర్సింలు, యాదమ్మ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.