హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మైస గళ్ళ బుచ్చేంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అంబేద్కర్ కలలు కన్నా రాజ్య స్థాపనకై మహాజన రాజ్యాధికార దిశగా ప్రయాణంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, అగ్రకుల పేదలందరిని ఐక్యం చేసి మహాజన రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కోటగళ్ల శివరామకృష్ణ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి వరిగుంతం కృష్ణ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు సాయికుమార్, కానుకుంట నర్సింలు, పిల్ల ముల్ల వీరేశం, మంగాపూర్ సర్పంచ్ యాదయ్య, మచ్ పూరి విష్ణు, నల్లుల ప్రభు తదితరులు పాల్గొన్నారు.