కవలంపేట ఎంకన్న స్వామికి వారోత్సవ పూజలు

70చూసినవారు
కవలంపేట ఎంకన్న స్వామికి వారోత్సవ పూజలు
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామ శివారులోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి శనివారం సందర్భంగా అభిషేకాలు, విశేష పూజలను నిర్వహించారు. బ్రహ్మీ ముహూర్తంలో ఉభయ దేవేరులతో స్వామివారి మూలమూర్తులకు అభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపి, సర్వాలంకార భరితంగా అలంకరించారు. అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్