జనం నివాసాల లోకి చేరిన వరద నీరు

1181చూసినవారు
జనం నివాసాల లోకి చేరిన వరద నీరు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మంగళవారం కుండపోత వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గల రహమత్ నగర్ కాలనీ నివాసుల ఇళ్లలోకి వర్షపు వరద నీరు చేరింది. మంగళవారం రాత్రి నుంచి నానా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పలువురు రహ్మత్ నగర్ కాలనీవాసులు వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్