నేటికీ వీడని మహిళ మృతి మిస్టరీ...!

4045చూసినవారు
నేటికీ వీడని మహిళ మృతి మిస్టరీ...!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ డివిజనల్ కోహీర్ పోలీస్ స్టేషన్ పరిధీ బడంపేట గ్రామ శివారులో పిట్టెల దడిగధరీ సమీపంలో నాలుగు రోజుల క్రితం లభ్యమైన గుర్తుతెలియని మహిళ అనుమానస్పద మృతదేహం మిస్టరీ నేటికీ వీడలేదు. మార్చి మాసం రెండో వారంలో బడంపేట గ్రామ కంఠం రాచన్న స్వామి జాతర ఉత్సవాలకు దూర ప్రాంతాల నుంచి హాజరైన వేలాది మంది భక్తుల కదలికలపై దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాల ఫుటేజీలను నేరపరిశోధన పోలీసులు పరిశీలిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ గుర్తు తెలియని మహిళ అత్యాచారానికి గురైందా? హత్యకు గురైంది? లేదా ఆత్మ హత్యకు పాల్పడిందా? అనే కోణంలో పరిశోధన ప్రక్రియ మొదలు పెట్టిన పోలీసులు సాక్షధారల కోసం ఆన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్