సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం వనంపల్లి నుండి సిద్ధాపూర్ ఝరాసంగం వెళ్లే రోడ్డు కంకర తేలి గుంతలు పడి అద్వానంగా తయారయ్యింది. ఈ రోడ్డు పైన వెళ్లాలంటే వాహనదారులు పాదచారులు భయపడుతున్నారు. కావున సంబంధిత అధికారులు ప్రమాదాలు జరగకముందే ఈ రోడ్డు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.