జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో పేరు పొందింది. జిల్లాలోనే నార్మల్ డెలివరీలో ప్రథమ స్థానంలో నిలిచింది. అత్యధిక పేషెంట్లు సందర్శించే ఆసుపత్రిగా నిలిచింది. అలాంటి ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యంగా ఆసుపత్రికి సంబంధించిన వ్యర్ధాలు పడేస్తున్నారు. దీనివల్ల ఆస్పత్రికి వచ్చే రోగులకు, సందర్శకులకు దోమల బాధ తప్పడం లేదు. ఇప్పటికైనా ఆసుపత్రి వర్గాలు స్పందించి ఉన్న పేరును నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.