బీహార్‌లోని నలందా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అక్కడి తెల్హారా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ గృహ వివాదానికి సంబంధించి న్యాయం అడిగేందుకు సర్పంచ్ దగ్గరుకు వెళ్ళింది. దీంతో ఆమెపై సర్పంచ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్పంచ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే చర్య తీసుకుని సర్పంచ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.