ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఈనెల 23న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌ను టాలీవుడ్ దర్శకుడు సుకుమార్‌తో పాటు బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా వీక్షించారు. ఈ సందర్భంగా దుబాయ్ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో సుకుమార్‌తో మాట్లాడుతున్న వీడియోను ఊర్వశీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇటీవల ‘డాకు మహారాజ్’ సినిమాతో ఊర్వశీ రౌతేలా హిట్ అందుకున్నారు.