పల్లీ పట్టీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పురాతన కాలం నుంచి ఇది ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని రోజూ తినడం వల్ల శారీరక బలహీనతను దూరం చేస్తుంది. అలాగే రక్తం అభివృద్ధికి దోహదపడుతుంది. గర్భిణులు, పిల్లలు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి, అలాగే ఎక్కువ సేపు శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. అందుకే వీటిని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్నాయి.