గత కొన్ని రోజులుగా ఎవరికి ఫోన్ చేసినా హోం మంత్రిత్వశాఖ జారీ చేసిన ప్రకటన అంటూ సైబర్ నేరాలపై ఓ అమ్మాయి అవగాహన కల్పిస్తోంది. అయితే, అర్జెంట్ అయి, ఏదైనా కోపంలో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఈ వాయిస్ విని తిట్టుకున్నవారూ చాలా మంది ఉన్నారు. తాజాగా ఈ వాయిస్ అందించిన యువతి ఎవరో కాదు.. రేడియో మిర్చి అమ్రిత. ఓ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఆమె రివీల్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది.