నేడు ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ భేటి

72చూసినవారు
నేడు ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ భేటి
ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది. ఈ క్రమంలో ఆదివారం సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎస్సీ ఉపకులాలకు 15 శాతం రిజర్వేషన్లు చెందనున్నాయి. అలాగే, 59 ఎస్సీ ఉపకులాలను మూడు కేటగిరీలుగా విభజించనున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్