పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసాలు.. రంగంలోకి ఈడీ

79చూసినవారు
పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసాలు.. రంగంలోకి ఈడీ
హైదరాబాద్‌ సైబర్ క్రైం పీఎస్ లో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో మోసాలపై 50కిపైగా కేసుల నమోదు అయ్యాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. FIR లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా పార్ట్ టైం ఉద్యోగాలపై సైబర్ నేరగాళ్లు ఆశ చూపుతున్నట్లు తేల్చింది. హోటళ్లు, టూరిస్ట్ వెబ్‌సైట్లు, రిసార్టుల వంటి వాటికి రేటింగ్ ఇస్తే ఆదాయం వస్తుందని మోసం చేస్తున్నారు. ఈ స్కామ్‌లో 580 ఖాతాల్లోని రూ. 32.34 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

సంబంధిత పోస్ట్