ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం (వీడియో)

548చూసినవారు
మధ్యప్రదేశ్ గుణాలో మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బీజేపీ జిల్లా స్థాయి నాయకుడు ఆనంద్ రఘువంశీ, సర్పంచ్ కమలేష్ యాదవ్, మనోజ్ ధాకడ్ రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. అంతలో వేగంగా వస్తున్న నల్లటి కారు వచ్చి ముగ్గురినీ బలంగా ఢీకొట్టింది. అనంతరం ఆ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆనంద్ రఘువంశీ, కమలేష్ యాదవ్ మృతి చెందారు. మనోజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :