షబ్ ఎ మిరాజ్ సందర్భంగా తెలంగాణలోని పలు స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ సెలవు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 28న ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. దీంతో మైనార్టీ విద్యా సంస్థలు హాలిడే ప్రకటించాయి. మిగతావి తమ స్వీయ నిర్ణయం ప్రకారం సెలవును ఇవ్వవచ్చు లేదా తరగతులు నిర్వహించవచ్చు. ఏపీలో సెలవుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మీకు ఈరోజు సెలవు ఉందా?.