వాంఖడేలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "రోహిత్, నేను చాలా కాలంగా టీ20 ప్రపంచకప్ కోసం ప్రయత్నిత్నించాం. మేము ప్రతిసారి ప్రపంచకప్ గెలవాలని కోరుకున్నాం. వాంఖడేకు ట్రోఫీని తీసుకురావడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. 2011 ప్రపంచకప్ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో నేను కనెక్ట్ కాలేకపోయాను. కానీ, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది. 15 ఏళ్లలో రోహిత్‌ను ఇంత ఎమోషనల్‌గా చూడటం ఇదే మొదటిసారి" అని అన్నాడు