హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. శిరీష భర్త, ఆయన సోదరి సరిత, మరో యువకుడు నిహాల్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. శిరీషను ఊపిరాడకుండా చేసి సరిత హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఆమెకు మత్తు మందు ఇచ్చినట్లు వారు తెలిపారు. వినయ్, శిరీష ప్రేమ వివాహం ఇష్టం లేని వినయ్ అక్క సరిత, ఒక పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.