ఎలక్ట్రిక్ బైక్‌లను తయారుచేసే స్టార్టప్ సంస్థ అల్ట్రావయలెట్ దేశీయ మార్కెట్‌లోకి తొలిసారిగా ఈవీ స్కూటర్ ‘టెసెరాక్ట్’ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.1.20 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించింది. తొలి 10 వేలమంది కస్టమర్లకు మాత్రమే ఈ ధరకు ఈవీని విక్రయిస్తామని పేర్కొంది. ఇందులో 6kwh బ్యాటరీ అమర్చారు. సింగిల్ ఛార్జ్‌తో ఈ స్కూటర్ 261 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.