ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. అహంకారానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అది జగన్ అంటూ ఎద్దేవా చేశారు. ‘జగన్ ఇస్టానుసారం మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సహించం. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వవద్దని ప్రజలే నిర్ణయించారు. చట్టాలను ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మేము అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.