పార్టీ విషయాలు బయట చర్చిస్తే చర్యలు తప్పవు: మీనాక్షి

52చూసినవారు
పార్టీ విషయాలు బయట చర్చిస్తే చర్యలు తప్పవు: మీనాక్షి
TG: కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో టీకాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ ముగిసింది. నేతలు ఆమెకు పని తీరు నివేదికలు ఇచ్చారు. నివేదికలు ఇవ్వకపోయినా ఎవరి పని తీరు ఏంటని తెలుసని అన్నారు. పని చేస్తుంది ఎవరు, యాక్టింగ్ చేస్తుంది ఎవరనేది కూడా తెలుసని తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చ చేయకండని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు. తన పని తీరు నచ్చకపోయినా ఫిర్యాదు చేయొచ్చు కానీ, బయట మాట్లాడకండని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్