కాలుష్యం ప్రకృతి, పర్యావరణానికి మాత్రమే కాదు మానవులకు కూడా తీవ్ర హానిని కల్గిస్తుంది. వీటిలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం వంటి అనేక రకాలున్నాయి. శబ్ద కాలుష్యం ప్రస్తుతం చాలా ప్రాణాంతకంగా మారింది. నిద్రలేచింది మొదలు, రాత్రి నిద్ర పోయే వరకూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల ధ్వనులు చెవులకు చిల్లులు పడేలా ఉన్నాయి. శబ్ధం స్థాయి పెరిగితే, వినికిడి సామర్థ్యం తగ్గుతుంది.