జగ్గంపేట వైసీపీలో వర్గవిభేదాలు.. ఉద్రిక్తత

79చూసినవారు
జగ్గంపేట వైసీపీలో వర్గవిభేదాలు.. ఉద్రిక్తత
AP: కాకినాడ జిల్లాలోని జగ్గంపేట వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. జగ్గంపేట YCPఇన్‌ఛార్జ్‌ను మారుస్తున్నారన్న ఓ వర్గం, చంటిబాబును విమర్శిస్తూ వైసీపీ నేత రమణ విమర్శలు చేశారు. దీంతో రమణ ఇంటిపై దాడికి చంటిబాబు వర్గం యత్నించింది. అనుచరులతో రమణ ఇంటికి తోట చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది.

సంబంధిత పోస్ట్