కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానుండగా, రేపు శ్రీరామనవమి రోజున ధ్వజారోహణ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 11న సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు దంపతులు హాజరవుతారని సమాచారం. ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి.