తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమీక్షలో నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలంటూ పంపిన వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. 2021, 2022లో రాష్ట్ర శాసనసభ రెండు సార్లు ఈ బిల్లును ఆమోదించి, కేంద్రానికి పంపింది. అయినప్పటికీ, కేంద్రం తమిళనాడును నీట్ నుంచి మినహాయించేందుకు నిరాకరించింది.