సమ్మర్‌లో వీచే వడగాల్పులు చాలా ప్రమాదకరం. వేడికి కళ్లలోని తేమ సైతం ఆవిరైపోతుంది. ఫలితంగా కంట్లో ఇసుక వేసిన అనుభూతి కలుగుతుంది. కంటివద్ద చర్మం పొడిబారుతుంది. దుమ్ము, ధూళి కంట్లో పడితే కళ్ల దురద, మంటలు వస్తాయి. బలమైన సూర్యకాంతి వల్ల కార్నియా దెబ్బతింటుంది. నిరంతరం సూర్యకాంతిలో ఉంటే కంటి సమస్యలు కూడా పెరుగుతాయి.