ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలతో ఆరోగ్యానికి మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బెల్లం శరీరంలోని విషపదార్థాల్ని బయటికి పంపించడంలో సహకరిస్తుంది. వేపాకు రక్తాన్ని శుద్ధి చేసి అనేక చర్మ వ్యాధులను నివారిస్తుంది. మామిడి వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేషన్ బారినుంచి కాపాడుతుంది. కారం జీర్ణశక్తిని పెంచి, బరువును తగ్గిస్తుంది. ఉప్పు నీరసాన్ని తరిమికొడుతుంది. చింతపండు శరీరంలోని కొలెస్
ట్రాల్ని తగ్గిస్తుంది.