ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ నడపనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రైన్ రాకపోకల కోసం నిర్మిస్తున్న వంతెన పనుల్లో అప్రశ్రుతి చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని వత్వా-రోపాడా ప్రాంతంలో జరుగుతున్న పనుల్లో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఓవర్ హెడ్ వైరు తెగిపడడంతో అహ్మదాబాద్-ముంబై మధ్య నడిచే పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు.