సీనియర్ హీరో సుమన్ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాది సమయంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ముందుగా వచ్చి స్నేహితులతో దర్శనం చేసుకున్నామని తెలిపారు. ఉగాది అంటే భారతీయులకు నూతన సంవత్సరం అని, ఈ ఉగాది నుంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.