పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాళ్లు: సీఎం చంద్రబాబు

61చూసినవారు
పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాళ్లు: సీఎం చంద్రబాబు
AP: పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు X వేదికగా స్పందించారు. 'ఇక నుంచి పార్లమెంట్ ఆవరణలోనే అరకు కాఫీని ఆస్వాదించవచ్చు. మన్ కీ బాత్‌లో అరకు కాఫీ గురించి ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. స్టాళ్ల ఏర్పాటుకు అనుమతించ్చిన స్పీకర్‌కు కృతజ్ఞతలు. స్టాళ్ల ఏర్పాటు మన గిరిజన రైతులకు గర్వకారణం' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఇటీవల టాటా గ్రూప్ కూడా అరకు కాఫీని కొనుగోలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్