AP: వైసీపీ ఎమ్మెల్యేలకు పదవి గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరుకాకుంటే MLAల సభ్యత్వం పోతుంది. సోమవారం వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై చేసిన సంతకాలను అధికారులు పరిగణనలోకి తీసుకోసారని సమాచారం. గవర్నర్ ప్రసంగం కస్టమరీ సెషన్ అని, స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్ని వర్కింగ్ డేగా పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశాల్లో వారు అసెంబ్లీకి రాకపోతే సీటు వేకెంట్ అని ప్రకటించవచ్చని తెలుస్తోంది.