ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో న్యూజిలాండ్ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ (112), లాథమ్ (55) పరుగులతో రాణించారు. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి న్యూజిలాండ్, భారత్ సెమీస్ చేరగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాయి.