బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన వైస్ చైర్మన్, కౌన్సిలర్లు

223194చూసినవారు
బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, 16మంది కౌన్సిలర్లు సోమవారం బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వైస్ చైర్మన్ షేక్ మున్న, కౌన్సిలర్లు లావణ్య, సంగీత , గంగా మోహన్ చక్రు, వరలక్ష్మి, ఈశ్వరి, లిక్కి శంకర్, బండారి ప్రసాద్, మేడిదాల సంగీత, వనం శేఖర్, కొనపత్రి కవిత, అతిక్, రాము, ఫయాజ్, నర్సారెడ్డి, ఇంతియాజ్, రెహమాన్‌ ఉన్నారు.

సంబంధిత పోస్ట్