రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణం పోవచ్చు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు నిర్లక్ష్యంగా రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ అతను అతడిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు యువకుడు గాల్లో ఎగిరి కిందపడ్డాడు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే యువకుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.