ఓటేసిన ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ

84చూసినవారు
దేశ వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే(30) నాగ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఓటు వేశానని చెప్పారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా జ్యోతి ఓటు వేశారు. జ్యోతి ఆమ్గే 1993 డిసెంబర్ 16న జన్మించారు. ఆమె రెండు అడుగుల ఏడు అంగుళాల పొడవుతో ప్రపంచంలో పొట్టి మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది.

సంబంధిత పోస్ట్