పిన్న వ‌య‌సులోనే 14 ప‌ర్వ‌తాల‌ను అధిరోహించిన నిమా రింజి షెర్పా

70చూసినవారు
పిన్న వ‌య‌సులోనే 14 ప‌ర్వ‌తాల‌ను అధిరోహించిన నిమా రింజి షెర్పా
నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల ప‌ర్వ‌తారోహ‌కుడు అరుదైన ఫీట్ అందుకున్నాడు. 8వేల మీట‌ర్ల ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న 14 ప‌ర్వ‌తాల‌ను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిమా రింజి షెర్పా రికార్డు నెల‌కొల్పాడు. తాజాగా చైనాలోని మౌంట్ షిష‌పంగ‌మా ప‌ర్వ‌తాన్ని అత‌ను అధిరోహించడంతో ఈ ఘనత సాధించాడు. స‌ముద్ర మ‌ట్టం క‌న్నా షిష‌పంగ‌మా ప‌ర్వ‌తం సుమారు 8027 మీ ఎత్తు ఉన్న‌ది. నిమాతో పాటు ప‌సంగ్ నుర్బు షెర్పా కూడా ఆ ప‌ర్వ‌తాన్ని ఎక్కారు.

సంబంధిత పోస్ట్