ఏపీలో ప్రతి రేషన్ దుకాణానికి కనీసం 650-750 కార్డులు ఉండేలా కొత్త దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబ సభ్యుల చేర్పు, కుటుంబ సభ్యుల తొలగింపు, చిరునామా మార్పు, కార్డులను సరెండర్ చేయడం వంటి కార్యక్రమాన్ని చేపడతారు. అక్టోబర్ 10వ తేదీన రాష్ట్ర మంత్రి వర్గం సమావేశంలో ఈ కొత్త రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటారు.